ఇప్పుడు ఎక్కడ చూసినా అణు ఒప్పందం గురించిన వార్తలే, నా ఉద్దేశ్యం ప్రకారం మన్మోహన్ సింగ్ తీసుకున్న నిర్ణయం చాల సరిఅయిన నిర్ణయం, ఎందుకంటె, న్యూక్లియర్ పవర్ చాలా శక్తివంతమయినది, దానిని ఉపయోగించి ఎంతో విధ్యుత్ ని తయారు చేయవచ్చు. ఈ పరిణామం వలన భారత్ 50 సంవత్సరాల ముందంజ వేసినట్లు, ఇప్పుడు మన రోజువారి పనులలో మరియు కర్మాగారాలలో విధ్యుత్ ఎంతో అవసరం. అణు విధ్యుత్ వలన ఈ కొరుత పూర్తిగా తీరవచ్చు, చూడండి మీకు రోజుకి 24 గంటల పాటు విధ్యుత్ ఉండి అదికూడా చాలా చౌకగా దొరుకబొతున్నది, మీరి ఏసి, కూలర్ ఆపనవసరమ్ లేదు, రైతులు చాలా సంతోషంగా ఉంటారు 24 గంటల విధ్యుత్ వలన, విధ్యుత్ రైలు చార్జీలు తగ్గే అవకాశం, కాలుష్యం తగ్గుతుంది, అసలు మనము ఊహించనివి ఎన్నో మంచులు జరుగనున్నవి.
ఇంకా కమ్యూనిస్టుల గురించి ఆలోచిద్దాం, వాళ్ళ ఉద్దేష్యంలో ఈ ఒప్పందం వలన మనము న్యూక్లియర్ బాంబులు తయారు చేయలేమని బాధ, అసలు న్యూక్లియర్ వార్ అనేది ఎప్పటికి వస్తది, అది రానే రాదు, ఒకవేల వస్తె ప్రపంచం మొత్తం ఉండదు, దాని గురించి ఆలోచించి ఇప్పుడు జరిగె మంచిని ఆపటం ఎంతవరకు సమంజసం.
ఈనాడు లో వచ్చిన ఈ వార్త చూడండి. అణు ఒప్పందం ఎంత ముఖ్యమో.

13 comments:
I am a supporter of Nuclear Deal. But I am facing a square opposition from everywhere. Im glad someone thinks like me.
"అబిప్రాయాలు" కాదు "అభిప్రాయాలు" అనివుండాలి. సరిచేసుకోగలరు.
ఇక అణుఒప్పందం విషయానికోస్తే, సమజహితం కోరె ఈ ఒప్పందమైనా అమోదయోగ్యమే కదా!.
వల్లూరి గారు,మీరు మరీనండి బాబు,బి కింద వత్తు వదిలేస్తే చెప్పారు సరి దిద్దుకొమ్మని మరి మీరు ... సమజహితం అన్నారు సమాజ కదా అది? అలాగే కోరె అన్నారు అది కోరే కదా?అలా చిన్నచిన్న అచ్చుతప్పులను మనం మరీ తీవ్రంగా తీసుకోకూడదని నా అభిప్రాయం.
వామపక్షాల బాధ అది కాదండీ..ఆ ఒప్పందం మీద సంతకం చేస్తే మన సార్వభౌమత్వం కోల్పోతామంటా..అక్కడికేదో ఇప్పుడు సార్వభౌమత్వమున్నట్టు..ఏ ఒప్పందము లేకుండానే ఎన్నో సంవత్సరాలు అణుపరీక్షలు జరపకుండా భారత్ ని నొక్కిపెట్టలేదా??
బ్రిటీషు వారు కూడా ఇలాగే ప్రవేశించారు ఏవో కొన్ని ఆశలు చూపి. 200-300 ఏళ్ళపాటు మన దేశ సంపదను కుమ్మేశారు. ఇప్పుడు ఈ ఆశ చూపి అమెరికన్లు మన గూటిలోకి వస్తున్నారు. ఒక్క 50 ఏళ్ళ ప్రయోజనం కోసం మన భవిష్యత్తును తాకట్టు పెడుతున్నాం. మంచికో చెడుకో వామపక్షాలు మొదటి సారిగ ఒక మంచి కారణం కోసం మోకళ్ళడ్డుతున్నారు.
ఒప్పంద ముసాయిదాలో అనేక లోపాలున్నాయి. ఒబామా గారు కూడా బుష్ కు మద్దతు (ఈ ఒప్పంద విషయంలో) తెలుపుతున్నారంటే, వారి దేశానికి నిగూఢ ప్రయోజనాలేవో వారికి ఉన్నాయి.
అమెరికా ఏదిచేసినా దాని స్వప్రయోజనం కొంత చూసుకునే చేస్తుంది.అది ప్రతిదేశం యొక్క హక్కు. మన ఉద్దేశమూ అదే కావాలి. ఈ ఒప్పందం వల్ల మనకు జరిగే నష్టం కన్నా లాభం ఎక్కువున్నప్పుడు...let's go for it.
IAEA safe guard draft ఈ క్రింది లంకెద్వారా మీరు చదివి తెలుసుకోవచ్చు. ఈ ఒప్పందం మన దేశానికి నష్టం అనుకునేవారు ఇందులోఉన్న లోపాలను ఎత్తిచూపి తెలియజెప్పగలరు.
http://www.indiademocracy.org/news/view/id/3088
Is America a soft power in India?
అందరు ఒప్పందంలో ప్రాబ్లం ఉంది అంటున్నారు కాని, ప్రాబ్లం ఏమిటి అనునది ఒక్కరు కూడా అందరికి అర్దం అవునట్లు చెప్పుటలేదు.
@పెదరాయ్డు గారు
మీకు ప్రాబ్లం గురించి చాల తెలుసులగున్నది, ఈ ఒప్పందం వలన కలిగె నష్టం ఏమిటి?
మీరు చెప్పె బ్రిటిష్ కాలంనాటి వి మాత్రం కాదు ఎందుకంటె ఇప్పుదు World మొత్తం Global Village గా మారి పోయినది,
Almost all countries doing business with other countries, మీరు అన్నట్లు అమెరికా వచ్చి ఇండియాని పరిపాలించాలి అంటె వాళ్ళకి ఈ ఒప్పందం ఏమి అక్కరలేదు, Direct ga war చేసి రావచ్చు, మీరు అన్నట్టు ఇప్పుడు ఇండీయా మొత్తం ఇండీయానె అప్పటిలాగా చిన్న చిన్న రాజ్యాలు లేవు, రాజులు లేరు.
@తెలుగు జాతి; ఈ విషయం స్పష్టమైన అవగాహన దేశస్థాయి నాయకులకే లేదు. ఈ ఒప్పదం ముసాయిదా ఒక national secret దాన్ని ప్రభుత్వంలోని బాధ్యతగల కొందరికేతప్ప మరెవ్వరికీ సమగ్రంగా తెలియదు. లెఫ్ట్ అభ్యంతరపెట్టినా, బిజెపి వ్యతిరేకించినా అన్నీ అనుమానాల ఆధారంగానే, నిజాలు ప్రభుత్వానికే తెలుసు.
అయితె మనమంత నిశ్చింతగా ఉండవచ్చు, ఆ ఒప్పందంని మన ప్రధానమంత్రి గారు బాగా అవగహన చేసుకొని, దేశానికి ఏమి ముప్పు లేకుంటేనే ఆమోదిస్తారు, ప్రధానమంత్రి ఒక్కరే కాకుండా ఎంతో మంది ఐ.ఎ.ఎస్ మరియు ఐ.పి.ఎస్ లు క్షున్నంగా చదివి ఆలోచించి చేసి ఉంటారు. దేశానికి ముప్పు ఉంటదేమో అని మన లెవల్ లో ఉన్నవారే ఇంత ఆలోచిస్తుంటె మన దేశప్రధాని గారు ఎంత ఆలోచించి ఉంటారో మీరు ఒకసారి ఆలోచించండి.
అణు ఒప్పందం ఇప్పుడు భారత్ కు ఎంత అవసరమో ఈనాటి ఈనాడు వార్త చూడండి.
http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel1.htm
ఈఆఏఆ డ్రాఫ్ట్ ఒక్కటే అణుఒప్పంద ప్రతి అనుకుంటే పొరబడినట్లే. అమెరికా యొక్క హైడ్ చట్టానికి మన ఆమోదం తెలిపిన తరువాతే, IAEA తొ మనం ముందుకు వెల్లగలుగుతున్నామన్న విషయాన్ని మరువకూడదు. IAEA స్వతంత్రంగా వ్యవహరించ గలిగితే హైడ్ చట్టానికి అవసరమే లేదు.UNO తరహాలొ IAEA ను కూడా ఒక పావుగా వాడుకోగలదనటానికి ఇరాన్ వ్యవహారం ఒక ఉదాహరణ మాత్రమే (భారత్ అమెరికా ఒత్తిడికి తలఒగ్గి ఇరాన్ను వ్యతిరేకించింది). హైడ్ చట్ట ప్రకారం అమెరికా అణు ఇంధన సరఫరాకు నిరాకరిస్తే, మనం NSG లోని ఏ ఇతర దేశం నుంచీ ఇంధనం కోనుగోలు చేయలేము. హైడ్ చట్టం లోని ఈఒక పరిమితి తోనే IEEA ఒప్పందం స్పూర్తి దెబ్బతింటుంది. ఇవేకాక ఈఆఏఆ ఒప్పందాన్ని, ఈ ఒప్పందానికి ముందు జరిగిన పరిణామాలను గమనిస్తే మరిన్ని లోపాలున్నయి.
ఇంతా చేసి ఈ ఒప్పందం ద్వారా మనం సాధించగలిగింది 4-5% అధిక విద్యుత్తు మాత్రమే. సమయాభావం వల్ల మరింత వివరంగా ఒక టపా లో చర్చిద్దాం.
http://panchayiti.blogspot.com/2008/07/blog-post_16.html
Post a Comment